Green Channel: గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ చానల్ ద్వారా గుండె తరలింపు
ABN , First Publish Date - 2023-09-26T20:30:52+05:30 IST
గుంటూరు నుంచి తిరుపతి(Guntur to Tirupati)కి గ్రీన్ చానల్(Green Channel) ద్వారా గుండెను తరలించారు. టీటీడీ పద్మావతి చిన్నపిల్లల హృదాలయంలో ఈరోజు గుండె మార్పిడి శస్ర్త చికిత్స చేశారు.
తిరుపతి: గుంటూరు నుంచి తిరుపతి(Guntur to Tirupati)కి గ్రీన్ చానల్(Green Channel) ద్వారా గుండెను తరలించారు. టీటీడీ పద్మావతి చిన్నపిల్లల హృదాలయంలో ఈరోజు గుండె మార్పిడి శస్ర్త చికిత్స చేశారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను వైద్యులు తీసుకొచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా హస్పిటల్‌కి గుండెను తరలించారు. 33 సంవత్సరాల యువకుడికి వైద్యులు గుండె మార్పిడి శస్ర్తచికిత్స నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి… బ్రెయిన్ డెడ్ అయిన 19 సంవత్సరాల కృష్ణ అనే యువకుడికి అవయవ దానంతో మరో నలుగురికి వైద్యులు ప్రాణం పోస్తున్నారు.