House Arrest: కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-10-07T11:17:19+05:30 IST

టీడీపీ నేతలు తలపెట్టిన ధర్మాగ్రహ శాంతిర్యాలీపై పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారు.

 House Arrest: కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్

గుంటూరు: టీడీపీ నేతలు తలపెట్టిన ధర్మాగ్రహ శాంతిర్యాలీపై పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, సీపీఐ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను (Former Minister Kanna Laxminarayana) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సాయంత్రం శాంతి ర్యాలీకి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దీనిపై మాజీ మంత్రి మాట్లాడుతూ.. ర్యాలీ తప్పకుండా జరుగుతుందని.. పోలీసులు ఆపిన తాము ర్యాలీకి వెళ్లి తీరతామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.


మరోవైపు పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికే పలువురు టీడీపీ, జనసేన కీలక నేతలు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ జరిగి తీరుతుందన్నారు. సాయంత్రం ర్యాలీగా తరలి రావాలని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగే ధర్మగ్రహ శాంతి ర్యాలీ ప్రభావం తాడేపల్లి ప్యాలెస్‌ను తాకాలని నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-07T11:18:40+05:30 IST