Justice For CBN: టీడీపీ అధినేతకు సంఘీభావం.. సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

ABN , First Publish Date - 2023-09-22T15:51:55+05:30 IST

బాపట్ల మండలం కొత్త ఓడరేవు సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని టీడీపీ నేతలు ఏర్పాటు చేయడం ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. జస్టిస్ ఫర్ సీబీఎన్ పేరుతో టీడీపీ సోషల్ మీడియా ఇంఛార్జి చింతకాయల విజయ్, టీడీపీ బాపట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

Justice For CBN: టీడీపీ అధినేతకు సంఘీభావం.. సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. నిరసన ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాలతో పాటు పలు రూపాల్లో టీడీపీ నేతలు తమ నిరసన తెలియజేస్తున్నారు. కొందరు వినూత్నంగా ఈ ప్రక్రియలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. బాపట్ల మండలం కొత్త ఓడరేవు సముద్ర తీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని టీడీపీ నేతలు ఏర్పాటు చేయడం ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. జస్టిస్ ఫర్ సీబీఎన్ పేరుతో టీడీపీ సోషల్ మీడియా ఇంఛార్జి చింతకాయల విజయ్, టీడీపీ బాపట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. సముద్రం ఒడ్డులోని ఇసుకతో అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. దీంతో చంద్రబాబు సైకత శిల్పం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Chandrababu news: సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్ట్ సంచలన తీర్పు

మరోవైపు సైకత శిల్పాన్ని సైతం వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో చంద్రబాబుకు సంఘీభావంగా సైకత శిల్పం ఏర్పాటు చేయించిన నేతలపై చర్యలకు పోలీసులు బాపట్ల జిల్లా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో అధిష్టానం నుంచి వచ్చే సూచనల మేరకు పోలీసులు కేసు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం చీకటిమయమై, కన్నీరు పెట్టుకుంటున్నట్లు సైకత శిల్పంలో చూపడంపై వైసీపీ నేతలు అభ్యంతరం చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సైకత శిల్పం ఏర్పాటును ముందే ఎందుకు అడ్డుకోలేదని స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించిన వారిపై కేసు పెట్టాలా వద్దా అనే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-22T15:51:55+05:30 IST