AP News: సోషల్‌ మీడియా కేసులలో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2023-09-27T11:03:31+05:30 IST

సోషల్ మీడియా కేసులలో జిల్లా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు.

AP News: సోషల్‌ మీడియా కేసులలో పోలీసుల అత్యుత్సాహం

గుంటూరు: సోషల్ మీడియా కేసులలో జిల్లా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటూ ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పిడికిటి శివ పార్వతి అనే మహిళను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివపార్వతి తండ్రి ఇటీవలే మరణించాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న శివపార్వతి విషయంలో పోలీసులు నిర్దయగా ప్రవర్తించారు. వచ్చే నెల 2వ తేదిన తండ్రి పెద్ద కర్మ ఉందని చెప్పినప్పటికీ ఖాకీలు వినిపించుకోని పరిస్థితి. శివపార్వతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. పోలీసుల తీరు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-27T11:03:31+05:30 IST