CM Jagan: గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇది

ABN , First Publish Date - 2023-06-02T11:02:21+05:30 IST

గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెప్పే రోజు ఇది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

CM Jagan: గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇది

గుంటూరు: గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్ధం చెప్పే రోజు ఇది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) అన్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు చేరుకున్న సీఎం చుట్టుగుంట సెంటర్‌లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం (YSR Seva Scheme) కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ఆర్బీకేల పరిధిలో యంత్రసేవా పథకం కింద వాహనాలు పంపిణి జరుగుతుందని తెలిపారు. రైతులే సంఘాలు మాదిరిగా ఏర్పడి ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారన్నారు. 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రూ.125.48 కోట్ల రాయితీని రైతు సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రైతులకు తక్కువ అద్దెకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులో తెచ్చామని వెల్లడించారు. రెండు విడతల్లో యంత్రసేవా పథకం అమలు చేశామన్నారు. ఇంకా మిగిలి ఉంటే అక్టోబర్ నెలలో వారికి కూడా యంత్ర పరికరాలు అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T11:02:21+05:30 IST