Ambati Rayudu: జగన్ పాలన గురించి అంబటి రాయుడు ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-06-30T16:02:51+05:30 IST

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు బాగున్నాయని క్రికెటర్ అంబటి రాయుడు కితాబు ఇచ్చారు. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అంబటి రాయుడు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వపరంగా మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెబుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు.

Ambati Rayudu: జగన్ పాలన గురించి అంబటి రాయుడు ఏమన్నారంటే..!

గుంటూరు: ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు బాగున్నాయని క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) కితాబు ఇచ్చారు. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అంబటి రాయుడు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వపరంగా మంచి సపోర్ట్ అందుతుందని రైతులు చెబుతున్నారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించినట్లు వెల్లడించారు. రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని రైతులు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వ స్కూల్స్ కూడా చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందని.. విద్యార్థులు భవిష్యత్తుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. సీఎం జగన్‌ను (Cm jagan) స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు కలిసినట్లు వివరించారు. రాష్ట్రంలో అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని మా తాత దగ్గర నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు స్పష్టం చేశారు.

ఇటీవల తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో అంబటి రాయుడు భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నారని.. వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వినిపించాయి. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని పొలిటికల్‌గా చర్చ నడిచింది. తాజాగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రశంసించారు.

Updated Date - 2023-06-30T16:05:29+05:30 IST