Natti kumar: పొలిటికల్ దుమారం రేపుతున్న వేళ ముద్రగడ లేఖపై నట్టికుమార్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-06-21T15:53:50+05:30 IST

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో జనసేనాని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా సడన్‌గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎంట్రీ ఇచ్చి

Natti kumar: పొలిటికల్ దుమారం రేపుతున్న వేళ ముద్రగడ లేఖపై నట్టికుమార్ ఏమన్నారంటే..!

హైదరాబాద్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో జనసేనాని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా సడన్‌గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎంట్రీ ఇచ్చి పవన్‌కల్యాణ్ తీరును తప్పుపడుతూ ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ పొలిటికల్‌గా పెద్ద దుమారమే చెలరేగింది. ముద్రగడ.. వైసీపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయారంటూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్‌గా సాగుతోంది. తాజాగా ఇదే అంశంపై సినీ నిర్మాత నట్టికుమార్ కూడా స్పందిస్తూ.. ముద్రగడ, ద్వారంపూడిలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

నట్టికుమార్ ఏమన్నారంటే..

‘‘జనసేన అధ్యక్షుడిగా పవన్‌కల్యాణ్ తన వెర్షన్ మాట్లాడారు. ఇందులో తప్పేముంది?. అలాగైతే ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడలో పవన్‌కల్యాణ్‌ని ఒక్క జెండా కూడా కట్టనివ్వనన్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనం కాదా?, పవన్‌ను కాకినాడలో అడుగుపెట్టనివ్వను అనడం తప్పు కాదా?. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పవన్ ఆరోపణలపై ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు.. కానీ మధ్యలో ముద్రగడ పద్మనాభం ఎందుకొచ్చారు. పవన్‌కల్యాణ్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?, కాపు వ్యక్తి సీఎం అవ్వాలి. పవన్ సీఎం అవుతారు. ఆయన్ని అందరూ సపోర్టు చేయాలి.’’ అని డిమాండ్ చేశారు.

ఎంపీ కిడ్నాప్ వ్యవహారంపై..

‘‘విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (Visakha MP MVV Satyanarayana) చర్చి సైట్‌లో 2 వేల కోట్ల నిర్మాణాలను కట్టేందుకు సిద్ధమయ్యారు. దీన్ని వెంటనే ఆపాలి. సీఎం జగన్ (CM JAGAN) దీనిపై చర్యలు తీసుకోవాలి. కిడ్నాప్‌, మనీ వ్యవహారాలపై ఆడిటర్ జీవీ, ఎంవీవీలను ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికిది తలవంపు వ్యవహారం. ప్రతిపక్షాలు కూడా ఈ ఇష్యూపై గట్టిగా మాట్లాడాలి. ఈ వ్యవహారంపై జగన్, చంద్రబాబు, అమిత్ షాలకు లేఖలు రాశాను.’’ అని నట్టికుమార్ వెల్లడించారు.

ఆదిపురుష్‌...

‘‘ఆదిపురుష్‌కు ప్రత్యేక షోలకు రెండు రాష్ట్రాల సీఎంలు పర్మిషన్స్ ఇచ్చారు. కానీ చిన్న సినిమాలకు కూడా ఐదో షో వేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని నాలుగేళ్లుగా అడిగినా పట్టించుకోలేదు. జగన్, కేసీఆర్ చిన్న సినిమాలపై దృష్టి పెట్టాలి. ఎన్నికల వస్తున్నాయి.. ఇప్పటికైనా జీవో ఇస్తారని మనవి చేస్తున్నాం.’’ అని నట్టికుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-21T15:55:55+05:30 IST