Yanamala: బీసీల జనగణనపై సీఎం ఎందుకు శ్రద్ధ పెట్టలేదు?

ABN , First Publish Date - 2023-10-08T13:23:00+05:30 IST

అమరావతి: బీసీల జనగణనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అసమంజసంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందే టీడీపీ శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

Yanamala: బీసీల జనగణనపై సీఎం ఎందుకు శ్రద్ధ పెట్టలేదు?

అమరావతి: బీసీ (BC)ల జనగణన (Janaganana)పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యవహరిస్తున్న తీరు అసమంజసంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందే టీడీపీ శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీసీల జనగణనపై సీఎం జగన్ ఎందుకు శ్రద్ధ పెట్టలేదని ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనలో బీసీ జనగణన గురించి ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు.

బీహార్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జనగణన మొదలుపెట్టి పూర్తి చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్రమ కేసులు, వేధింపులతో జగన్మోహన్ రెడ్డి మునిగి తేలుతున్నారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్‌తో 139 కులాలకు టీడీపీ సమన్యాయం చేస్తే.. జగన్ బడ్జెట్‌లో కేటాయించిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ జనగణన చేపట్టి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామని యనమల స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-08T13:23:00+05:30 IST