Share News

YuvaGalam: ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.. లోకేష్ హామీ

ABN , First Publish Date - 2023-11-28T11:24:41+05:30 IST

Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కోనసీమజిల్లా ఆక్వా రైతులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని యువనేత హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

YuvaGalam: ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.. లోకేష్ హామీ

తూర్పుగోదావరి: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను (Yuvagalam Padayatra) ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కోనసీమజిల్లా ఆక్వా రైతులు (Aqua farmers) కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని యువనేత హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీడ్, ఫీడ్, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం (Jagan Government) కోలుకోలేని దెబ్బతీసిందని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) అరాచకపాలనలో ఆక్వారంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. టీడీపీ (TDP) పాలనలో ఆక్వారంగాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపామని చెప్పుకొచ్చారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీకి జోన్ల విధానం అమలు చేయడం ద్వారా భారీ రేట్లు వసూలు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతాంగానికి యూనిట్ 1.50 కే విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఫీడ్, సీడ్, విద్యుత్ ధరలను తగ్గేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-28T11:24:42+05:30 IST