Share News

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు అపూర్వ ఆదరణ

ABN , First Publish Date - 2023-12-10T07:33:16+05:30 IST

తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలో 218వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు ఒంటిమామిడి క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.10 గంటలకు ఒండిమామిడి జంక్షన్‌లో మత్స్యకారులతో సమావేశమవుతారు.

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు అపూర్వ ఆదరణ

తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలో 218వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు ఒంటిమామిడి క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.10 గంటలకు ఒండిమామిడి జంక్షన్‌లో మత్స్యకారులతో సమావేశమవుతారు. 9.45 గంటలకు తొండంగి హనుమాన్‌ జంక్షన్‌లో రైతులతో సమావేశం... 10 గంటలకు తొండంగి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద స్థానికులతో భేటీ... 10.45 గంటలకు శృంగవృక్షంలో ఎస్సీ సామాజిక వర్గీయులను కలుస్తారు. 11.15 గంటలకు లోకేష్ శృంగవృక్షంలో భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు శృంగవృక్షంలో కాకినాడ సెజ్‌ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు శృంగవృక్షంలో పాదయాత్ర కొనసాగుతుంది. 5 గంటలకు వలసపాకల గ్రామంలో స్థానికులతో సమావేశమవుతారు. 5.30 గంటలకు తిమ్మాపురంలో పెరిక సామాజిక వర్గీయులతో భేటీ అవుతారు. 6.30 గంటలకు తిమ్మాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో దళితులతో సమావేశం... 7.45 గంటలకు తేటగుంట జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పంజాబి దాబా వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస చేస్తారు. కాగా ఇప్పటివరకు నారా లోకేష్ నడిచిన మొత్తం దూరం 2990.4 కి.మీ.

కాగా నిన్న సాగర తీరం వెంట జనసంద్రం పోటె త్తింది. అభిమానం వెల్లువలా ఉప్పొంగింది. కెరటాల సవ్వడిలా... జనసవ్వడి జాతరను తలపించింది. యువత, మహిళలు, మత్స్యకారులు, రైతులు అడుగులో అడుగేస్తూ లోకేశ్‌ యువగళం పాద యాత్రకు ఉప్పెనలా కదిలారు. అభిమాన దండు అడుగులతో కోన తీరం కిక్కిరిసింది. 217వ రోజు పాదయాత్రలో భాగంగా లోకేశ్‌ శనివారం పిఠా పురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం శీలంవారిపాకలు గ్రామం నుంచి ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. తుఫాన్‌ నేపథ్యంలో ఈ నెల 4 నుంచి యువగళానికి తాత్కాలిక బ్రేక్‌ ప్రకటించి శనివారం పునః ప్రా రంభించారు.యాత్ర జరిగే రహదారి పూర్తిగా కోనప్రాంతంలో సముద్రతీరం వెంబడి ఉండడం తో పూర్తిగా కిక్కిరిసిపోయింది. దారిలో లోకేశ్‌ వచ్చీపోయే వాహనాల్లో ప్రజలకు ఒకపక్క అభి వాదం చేసుకుంటూ కదిలారు. ఆటోలు, బస్సుల్లో వెళ్తున్న మహిళలు, కార్మికులు, మత్స్యకారులను ఆప్యాయంగా పలకరించారు. కోనపాపేటలో తనను కలిసిన హేచరీల ప్రతినిధుల సమస్యలు విన్నారు. అధికారంలోకి రాగానే అండగా ఉంటా మని ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. సముద్రపు కోత తీవ్రత అధికంగా ఉండడంతో కోనపా పేటలో మత్స్యకారుల ఇళ్లు సముద్రంలో కొట్టుకు పోతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ లోకేశ్‌కు వివరించారు. జియోట్యూబ్‌ నిర్మించి ఆదుకుంటా మని భరోసా ఇచ్చారు. పిఠాపురం, తుని నియో జకవర్గాల మధ్యలో ఉన్న శ్రీరాంపురం వద్ద సెజ్‌ బాధితులు లోకేశ్‌ను కలిసి తమ బాధలు వివ రించారు. అనంతరం పెరుమాళ్లపురం సమీపం లోని తలపంటి గ్రామంలో లోకేశ్‌ మధ్యాహ్నం బస చేశారు. అక్కడే మత్స్యకారులతో ముఖా ముఖి సభ నిర్వహించారు. మత్స్యకారులు డీజిల్‌ సబ్సిడీ, వలలు, బోట్లకు బీమా ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీమా కల్పిస్తామ న్నారు.కార్యక్రమంలో మాజీ మం త్రులు నిమ్మకా యల చినరాజప్ప, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, వర్మ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల, ప్రత్తి పాడు ఇన్‌ఛార్జి సత్యప్రభ, పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జి ఉదయశ్రీనివాస్‌, జిల్లా టీడీపీ అధ్య క్షుడు జ్యోతుల నవీన్‌, అమలాపురం పార్ల మెంట్‌ ఇన్‌ఛార్జి గంటి హరీష్‌, పెద్దాపురం టీడీపీ సీనియర్‌ నేత గుణ్ణం చంద్ర మౌళి,తనయుడు గుణ్ణం రిత్విక్‌, అమలాపురం నియోజకవర్గ పరిశీ లకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, అనం తపురం నుంచి జనసేన నేత పెండ్యాల శ్రీలత తనయుడు మౌనేష్‌,కాకినాడ రూరల్‌నేత పెంకే శ్రీనివాస బాబ,రంపచోడవరం సీనియర్‌ నేత మీసాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T07:33:18+05:30 IST