Share News

Ramakrishna: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-12-07T17:07:20+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి సీపీఐ తరుపున శుభాకాంక్షలు తెలిపారు.

 Ramakrishna: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ నేత రామకృష్ణ శుభాకాంక్షలు

ప.గో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( Ramakrishna ) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డికి సీపీఐ తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... ఇది శుభపరిణామం, తెలంగాణాలో కాంగ్రెస్, సీపీఐ కలిసి పనిచేశాయి. మా అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం ఉండేటట్లు చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విభజన బిల్లులోని హామీలు అమలు చేయకుండా తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి రేవంత్‌రెడ్డి ముందుకు రావాలి’’ అని రామకృష్ణ కోరారు.

Updated Date - 2023-12-07T17:07:21+05:30 IST