Big Breaking : నారా లోకేష్‌పై సీఐడీ కేసు.. 14వ నిందితుడిగా చేరుస్తూ పిటిషన్..
ABN , First Publish Date - 2023-09-26T12:22:05+05:30 IST
ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను 14 వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేస్తున్నారు.
విజయవాడ : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను 14 వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చారు. కాగా.. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబును బెయిల్‌పై బయటకు రప్పించేందుకు తరచూ న్యాయవాదులతో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్‌ను సైతం అరెస్ట్ చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో లోకేష్‌ను నిందితుడి చేర్చడం ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.