Tirumala : గోవిందుని సాక్షిగా పవన్‌పై మాజీ దేవాదాయశాఖా మంత్రి విమర్శలు..
ABN , First Publish Date - 2023-07-07T12:33:45+05:30 IST
తిరుమల ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ భక్తికి తప్ప మరొక విషయాలకు తావుండదు. చాలా మంది ప్రశాంతత కోసం తిరుమలకు వెళుతుంటారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అక్కడ కూడా రాజకీయాలను వదలడం లేదు. మంత్రి రోజా అవకాశం దొరికినప్పుడుల్లా నెలకో.. రెండు నెలలకో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
తిరుమల : తిరుమల ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ భక్తికి తప్ప మరొక విషయాలకు తావుండదు. చాలా మంది ప్రశాంతత కోసం తిరుమలకు వెళుతుంటారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అక్కడ కూడా రాజకీయాలను వదలడం లేదు. మంత్రి రోజా అవకాశం దొరికినప్పుడుల్లా నెలకో.. రెండు నెలలకో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆమె కూడా ఆలయం ఎదుటే నిలబడి విపక్ష నేతలపై దుమ్మెత్తి పోస్తుంటారు.
ఇక మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం రోజా బాటలోనే పయనిస్తున్నారు. గోవిందుని సాక్షిగా విపక్ష పార్టీల నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నేడు శ్రీవారిని దర్శించుకున్న వెల్లంపల్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడటం అనవసరం అంటూనే ఆరోపణలు చేశారు. ప్యాకేజీ రావడంతో పవన్ కళ్యాణ్ మొదటి విడత యాత్ర పూర్తి చేశాడన్నారు. మళ్లీ విడత ప్యాకేజీ వస్తే.. రెండవ విడత యాత్రను ప్రారంభిస్తారన్నారు. ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడటం అనవసరమని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.