Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

ABN , First Publish Date - 2023-06-11T07:17:00+05:30 IST

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు (devotees) వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్‌ (Que Complex)లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న (శనివారం) శ్రీవారిని 88,626 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 51,379 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2023-06-11T07:17:00+05:30 IST