Share News

Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Dec 29 , 2023 | 08:41 AM

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.

Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద భాహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు రామకుప్పంకు చేరుకుని పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 5గంటలకు కుప్పం బైపాస్ రోడ్డులోని ఎంఎం మహల్‌కు చేరుకొని జనసేన శ్రేణులతో ఇంటరాక్ట్ అవుతారు. 6 గంటలకు బీసీఎన్ కల్యాణ మండపంలో టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు.

‘యువతలో ఇంటికి ఒకరు రోడ్డుమీదికి రావాలి. నాతో కలిసి ప్రజల్లో మార్పు తీసుకు రావాలి. మీ జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నాది’ అని మాజీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మిగిలిందిక వంద రోజేలేనన్నారు. వైసీపీలో కొంతమంది మిడిసిపడుతున్నారని, అలాంటి వారిని అణచివేయడమెలాగో తనకు తెలుసన్నారు. మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం గుడుపల్లెలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చిన్నపిల్లల నుంచి యువత వరకు వారి భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నదన్నారు. ‘ఒక్క ఛాన్స్‌ అడిగితే ఓటేస్తే నాశనం చేశాడు. మళ్లీ ఓటేస్తే గంజాయి, గ్రానైట్‌, ఇసుక, మాఫియా రాష్ట్రంగా మారిపోతుంది, ఆలోచించండి’ అని హెచ్చరించారు. వెనుకబడిన కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ నియోజకవర్గాన్ని తాను ఎంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. 35 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నానని చెప్పారు. ‘నేను అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. లేనప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఒక తట్ట మట్టి వేశారా?’ అని జనాలను ప్రశ్నించారు. కరువులో ఇంటింటికీ రూ.2 కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించిన ఘనత టీడీపీకి దక్కిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ధరను రూ.5కు పెంచారని, తాము అధికారంలోకి రాగానే మళ్లీ రూ.2 కు అందిస్తామని హమీ ఇచ్చారు. తాను హంద్రీ-నీవా కాలువ తవ్వకం ద్వారా రామకుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చానన్నారు. అక్కడినుంచి ఇక్కడికి తేవడానికి ఈ ఐదేళ్లలో వీళ్ల వల్ల కాలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హంద్రీ-నీవా కాలువ మిగిలిన పనులు పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. గుడుపల్లె మండలానికి ఎంతో చేశానని గుర్తుచేసుకున్నారు. స్థానికుల కోరక మేరకు మినీ మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేస్తానన్నారు. నియోజకవర్గంలో గతంలో 99 శాతం టీడీపీ పడే ఓట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయన్నారు. ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 08:41 AM