YCP: మరోసారి పూతలపట్టు ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ABN , First Publish Date - 2023-06-08T15:53:42+05:30 IST
మొగిలివారి పల్లెలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పర్యటించారు. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటించడానికి వచ్చారు. కానీ
చిత్తూరు: బంగారుపాలెం మండలం మొగిలివారిపల్లెలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది.
మొగిలివారి పల్లెలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పర్యటించారు. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటించడానికి వచ్చారు. కానీ గ్రామంలో ఎన్టీఆర్ శతజయించి ఉత్సవాలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. ఎమ్మెల్యే గ్రామంలోకి రాగానే టీడీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా గ్రామస్తులు గుడి మైక్ ద్వారా ‘సైకో పోవాలి-సైకిల్ రావాలి’నే పాటను వినిపించారు. దీంతో ఎమ్మెల్యే గ్రామస్తులుపై అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. ఈ సందర్భంగా గ్రామంలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.