Chinta Mohan: వైసీపీ, బీజేపీతో ఎలాంటి ప్రయోజనం లేదు.. కాంగ్రెస్‌తో ప్రజలకు మేలు జరుగుతోంది
ABN , First Publish Date - 2023-12-10T19:37:47+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదంటూ చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు: పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అంటూ చైతన్య కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదంటూ చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మేలు జరుగుతుందని చింతామోహన్ తెలిపారు.