Chandrababu: వివేకా హత్య కేసు నుంచి జగన్ తప్పించుకోలేరు

ABN , First Publish Date - 2023-02-02T18:13:48+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan reddy) పై టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) విమర్శలు గుప్పించారు.

Chandrababu: వివేకా హత్య కేసు నుంచి జగన్ తప్పించుకోలేరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jaganmohan reddy) పై టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసు (Viveka murder case) నుంచి సీఎం జగన్ తప్పించుకోలేరని, తాజా పరిణామాలతో అన్ని వేళ్లూ జగన్ కుటుంబం వైపే చూపుతున్నాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. సొంత పార్టీ నేతలే ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, రోడ్డెక్కిన పరిస్థితిపై సీఎం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్కు అధికారం.. పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. విపక్షాల అణచివేతకు జీవో నం.1 తేవడం, పార్టీలపై ఆంక్షలు పెట్టడం, ఫోన్ ట్యాపింగ్ (Phone tapping)లపైనే దృష్టి పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం పట్టించుకోవడం లేదని, వైసీపీ ఎంపీలు పనిచేసేది సొంత లాబీయింగ్ కోసమే అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, కరవు జిల్లాలకు నిధులు సహా ఒక్క అంశంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి పరంగా రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని చంద్రబాబు అన్నారు. జగన్ స్కీం పెట్టాడు అంటే అందులో సొంత స్కామ్ ఉంటుందని, జే బ్రాండ్స్ మద్యం, ఇసుక విధానాలే అందుకు ఉదాహరణ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్లు, నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహణ, సభ్యత్వ నమోదు, ఓటర్ వెరిఫికేషన్తో సహా పలు అంశాలపై చంద్రబాబు సమీక్షించారు.

Updated Date - 2023-02-02T18:24:56+05:30 IST