Share News

BV Raghavulu : మాది పిట్టల పార్టీ అయితే.. వారిది రాబందుల పార్టీ

ABN , First Publish Date - 2023-11-23T12:44:35+05:30 IST

బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్ ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే.. వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు.

BV Raghavulu : మాది పిట్టల పార్టీ అయితే.. వారిది రాబందుల పార్టీ

విజయవాడ : బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్ ఇచ్చారు. పిట్టలంటే అందరికీ గౌరవమని.. మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్ ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే.. వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు. తాము ప్రజల కోసం పని చేస్తామని.. వారు పెట్టుబడిదారుల కోసం పని చేస్తారన్నారు. సమాజాన్ని నాశనం చేయడానికే ఆ రాబంధులు పని చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు.

మా వల్ల ప్రజలకు మేలు జరిగితే.. వాళ్ల వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ను తొలగించి, కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారని బీవీ రాఘవులు ప్రశ్నించారు. కర్నాటక, ఇతర రాష్ట్రాలలో వాళ్ల పార్టీ నాయకులను ఎందుకు మార్చారని నిలదీశారు. వాళ్ల సంగతి వాళ్లు తెలుసుకుని ప్రజల ఆదరణ పొందితే మేలని అన్నారు. వైరుధ్యాలు ఉన్నా అనేక పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పడ్డాయన్నారు. మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ఇండియా పని చేస్తోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎంలు శాసన సభకు వెళ్లాలని ఎవరికి వారుగా పోటీ చేస్తున్నామని బీవీ రాఘవులు తెలిపారు.

Updated Date - 2023-11-23T12:44:37+05:30 IST