AP Budget : బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బుగ్గన

ABN , First Publish Date - 2023-03-16T08:56:35+05:30 IST

నేడు ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే 2023-24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయల్దేరారు.

AP Budget : బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బుగ్గన

విజయవాడ : నేడు ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలోనే 2023-24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయల్దేరారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయల్దేరారు. సెక్రటేరియట్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

8 గంటలకు జరగనున్న సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉద‌యం 10 గంట‌లకు బడ్జెట్‌ను బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు. ఉన్న పథకాలను బలపరిచేలా మరింత మందికి అవకాశం ఇచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు బుగ్గన తెలిపారు.

Updated Date - 2023-03-16T08:57:41+05:30 IST