AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం

ABN , First Publish Date - 2023-03-17T19:30:12+05:30 IST

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌..

AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం

విశాఖ: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్‌ (Madhav)కు చెల్లని ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఓట్ల లెక్కింపులో 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8 రౌండ్లు లెక్కింపు తర్వాత మాధవ్‌కు 10,884 ఓట్లు వచ్చాయి. 8 రౌండ్లలో 12,318 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,00,924 మంది (69.47 శాతం) ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. పోలైన ఓట్లన్నింటినీ కలిపి లెక్కిస్తున్నారు. ఏడు రౌండ్లలో రౌండ్‌కు 28 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పూర్తిస్థాయిలో 50 శాతం పైబడి ఎవరికీ రానందున.. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రారంభించారు. టీడీపీ (TDP) అభ్యర్థి చిరంజీవిరావు (Chiranjeevi Rao) 82958 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. చిరంజీవిరావు విజయానికి 94509 ఓట్లు రావాలి. అయితే రెండో ప్రాధాన్యత క్రమంలో చిరంజీవికి 11,551 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 26,823 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసీపీ (YCP) అభ్యర్థికి 54,374, పీడీఎఫ్‌ (PDF) 33,657, బీజేపీ (BJP) 10,884 ఓట్లు పోలయ్యాయి.

టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ ముందంజ

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత కౌంటింగ్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ (TDP candidate Srikanth) ముందంజలో ఉన్నారు. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కించారు. శ్రీకాంత్‌కు 25,731 ఓట్ల మెజార్టీ సాధించారు. టీడీపీకి 1,06,587, వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి (Shyamprasad Reddy)కి 80,856 ఓట్లు పోలయ్యాయి. ఎవరికీ పూర్తి మెజార్జీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తున్నారు. మొత్తం 2.70లక్షల ఓట్లు పోలయ్యాయి. ఒక్కోరౌండ్‌కు 40వేల ఓట్లను లెక్కించారు. అందులో ప్రతీరౌండ్‌లోనూ దాదాపు మూడువేల చెల్లని ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత లెక్కింపులో 51 శాతం ఆదిక్యత తప్పనిసరి. టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థులిద్దరూ 51 శాతం మెజారిటీ సాధించలేకపోయారు. దీంతో ఫలితం ఎవరికీ తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

Updated Date - 2023-03-17T19:59:15+05:30 IST