MP Raghurama: వైసీపీపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-04T19:08:34+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP raghurama krishnam raju) కీలక వ్యాఖ్యలు చేశారు.

MP Raghurama:  వైసీపీపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP raghurama krishnam raju) కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP)లో అసంతృప్తి పతాక స్థాయికి చేరే ఛాన్స్‌ ఉందన్నారు. పార్టీలో జగన్‌రెడ్డి (CM Jagan) చెప్పినట్లు పడి ఉండాలంటే.. ప్రతిఒక్కరూ ఏదో ఒక రోజు తిరగబడతారని పేర్కొన్నారు. పార్టీలో కోటంరెడ్డికి ఒక రూల్.. జగన్‌రెడ్డికి మరొక రూలా? అని ఆయన ప్రశ్నించారు. వివేకా గదిలో రక్తపు మరకలు శుభ్రం చేసినవారికే.. వివేకా హత్యతో ప్రమేయం ఉందని ఎంపీ రఘురామ ఆరోపించారు.

ఇదిలావుండగా... మరోవైపు పార్లమెంట్‌ చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని ఎట్టకేలకు మాజీ మంత్రి కొడాలి నాని గ్రహించారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే రానున్న ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని కేంద్రంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామంటూ ఆయన పేర్కొన్నారని గుర్తుచేశారు. అదానీ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారని, జగన్‌తో స్నేహం తర్వాత ఆయన కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయని అన్నారు.

Updated Date - 2023-02-04T19:08:36+05:30 IST