CM Jagan: జగన్ అలా చెప్పడం అభ్యంతరకరం: బీజేపీ నేత

ABN , First Publish Date - 2023-01-31T21:46:36+05:30 IST

విశాఖ రాజధాని కాబోతోందని సీఎం చెప్పారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP Satya Kumar) అన్నారు.

CM Jagan: జగన్ అలా చెప్పడం అభ్యంతరకరం: బీజేపీ నేత

అమరావతి: విశాఖ రాజధాని కాబోతోందని సీఎం చెప్పారని బీజేపీ నేత సత్యకుమార్‌ (BJP Satya Kumar) అన్నారు. సీఎం ఆఫీస్‌ (CM Office) విశాఖ (Visakha)కు తరలిస్తున్నట్లు చెప్పడం అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు. కోర్టు (Court) పరధిలో ఉన్న అంశంపై ఎలా ప్రకటన చేస్తారు? ఆయన ప్రశ్నించారు. జగన్‌రెడ్డికి (CM Jagan) రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రాజధాని ప్రకటన చేశారని అన్నారు. జగన్‌కు ప్రజాదరణ తగ్గిందని ఇండియాటుడే (india today ) సర్వేలో తేలిందని సత్యకుమార్‌ అన్నారు. రాష్ట్రానికి జగన్‌ ఒక్క పైసా పెట్టుబడి, పరిశ్రమ తేలేకపోయారని విమర్శించారు. దావోస్‌ పర్యటనలో ఒక్క పైసా పెట్టుబడి రాలేదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-01-31T21:46:36+05:30 IST