AP High court: సలహాదారుల నియామకంపై ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-02T18:55:03+05:30 IST

సలహాదారుల (Advisors) నియామకం వ్యవహారంపై ఏపీ హైకోర్టు (AP HIgh court)లో విచారణ జరిగింది.

AP High court: సలహాదారుల నియామకంపై ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: సలహాదారుల (Advisors) నియామకం వ్యవహారంపై ఏపీ హైకోర్టు (AP HIgh court)లో విచారణ జరిగింది. సలహాదారుల నియామకంపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సలహాదారులకు జవాబుదారీతనం, బాధ్యత ఏముంటుందని, వారికి నియమ నిబంధనలు, ఎలాంటి ప్రవర్తనా నియమావళి లేదని హైకోర్టు తెలిపింది. సలహాదారుల ద్వారా ప్రభుత్వ సున్నిత సమాచారం కూడా బయటకు వెళ్లే ప్రమాదం ఉందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.

రోడ్డుపై వెళ్లే వ్యక్తిని రాత్రికిరాత్రే సలహాదారుగా నియమించడానికి వీల్లేదని, సలహాదారుల నియామకంపై మార్గదర్శకాలు జారీ చేయబోమని హైకోర్టు కోర్టు వెల్లడించింది. వారికి సంబంధించి రాజ్యాంగబద్ధతను మాత్రమే తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-02-02T18:55:25+05:30 IST