Share News

AP News: హిందూపురంలో వైసీపీ బస్సు యాత్ర.. డీజేల మోత.. చివరకు న్యాయమూర్తి ఆగ్రహించడంతో..

ABN , First Publish Date - 2023-11-15T11:03:15+05:30 IST

హిందూపురం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

AP News:  హిందూపురంలో వైసీపీ బస్సు యాత్ర.. డీజేల మోత.. చివరకు న్యాయమూర్తి ఆగ్రహించడంతో..

శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో వైసీపీ నేతలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో రాకపోకలను వైసీపీ నేతలు నిలిపివేశారు. సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం ఉంటే ఉదయం నుంచే పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్న పరిస్థితి. అలాగే ప్రధాన కూడళ్లలో దుకాణాలను కూడా వైసీపీ నేతలు మూసివేయించారు. సామాజిక సాధికార బస్సుయాత్రకు హిందూపురం పట్టణంలో హడావుడి చేస్తూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులు మూసివేయడంతో హిందూపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక సౌండ్‌తో రోడ్డుపై డీజేల మోతతో కోర్టు కార్యకలాపాలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులను కోర్టుకు పిలిపించిన హిందూపురం న్యాయమూర్తి.. ఈ డీజే శబ్దాలు ఏంటని, ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు డీజే శబ్దాలు నిలుపుదల చేయించారు. వైసీపీ నేతలు, పోలీసుల తీరుపై హిందూపురం వాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-11-15T12:55:17+05:30 IST