Paritala Sriram: బ్లాక్‌డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసన.. ధర్మవరంలో హై టెన్షన్

ABN , First Publish Date - 2023-09-11T10:14:12+05:30 IST

జిల్లాలోని ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు.

Paritala Sriram: బ్లాక్‌డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసన.. ధర్మవరంలో హై టెన్షన్

శ్రీసత్యసాయి జిల్లా: జిల్లాలోని ధర్మవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను (TDP Chief Chandrababu Arrest) నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram)ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. బ్లాక్ డ్రెస్‌తో పరిటాల శ్రీరామ్ నిరసనకు దిగారు. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు.. దీంతో పోలీసులు, పరిటాల శ్రీరామ్ మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది.


పోలీసుల నిర్బంధాన్ని దాటుకుని మరీ...

అటు.. మాజీ మంత్రి పరిటాల సునీతను (TDP Leader Paritala Sunita) తెల్లవారుజామున నాలుగు గంటలకే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసు నిర్బంధాన్ని దాటుకొని మరీ సునీత బయటికి వచ్చారు. టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ పరిటాల సునీత ముందుకు దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Updated Date - 2023-09-11T10:14:12+05:30 IST