YCP: చెప్పులతో కొట్టుకున్న వైసీపీలో ఇరు వర్గాలు

ABN , First Publish Date - 2023-05-29T16:24:20+05:30 IST

జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ (YCP)లోని ఇరు వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు.

YCP: చెప్పులతో కొట్టుకున్న వైసీపీలో ఇరు వర్గాలు

శ్రీ సత్యసాయి: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ (YCP)లోని ఇరు వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. కనగానపల్లి మండలం కోనాపురంలో ప్రభుత్వ నిధులను కాజేసిన వ్యవహారంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. విభేదాల నేపథ్యంలో కనగానపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీలోని ఇరు వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. వైసీపీలోని ఇరు వర్గాల దాడులు ప్రతి దాడులతో ప్రభుత్వ ఉద్యోగులు పరుగులు పెట్టారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుసుకుంది.

Updated Date - 2023-05-29T16:24:20+05:30 IST