Vijayashanthi: విద్యా వ్యవస్థను కేసీఆర్ ఆగం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ సర్కార్ విఫలమైంది

ABN , First Publish Date - 2022-11-30T23:14:49+05:30 IST

కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vijayashanthi: విద్యా వ్యవస్థను కేసీఆర్ ఆగం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ సర్కార్ విఫలమైంది

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆమె మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..

''విద్యా వ్యవస్థను ఆగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... కెసిఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. అకడమిక్​ఇయర్ ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కెసిఆర్ సర్కార్ విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్లుగా విద్యా వలంటీర్ల ను రిక్రూట్​మెంట్​ చేయకపోవడంతో హైస్కూల్​విద్య అస్తవ్యస్తంగా మారింది. విద్యాశాఖ అధికారులు మాత్రం టెన్త్​ స్టూడెంట్లకు స్పెషల్​ క్లాసుల పేరుతో మొక్కుబడిగా యాక్షన్ ప్లాన్ ను రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. అరకొర టీచర్లతో టెన్త్​సిలబస్ కొన్ని సబ్జెక్ట్ లు 60 శాతం పూర్తయినా, టీచర్లు లేని సబ్జెక్ట్ లు ఇంకా స్టార్ట్ కాలేదు. అకడమిక్ ​ఇయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక స్కూళ్లల్లో కొన్ని సబ్జెక్టులకు టీచర్లు లేక టెన్త్​స్టూడెంట్లు కనీసం ఆ బుక్స్​కూడా తెరవలేదు. స్టూడెంట్ల పరిస్థితులను అంచనా వేసి టీచర్లను సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ సంగతే మరిచిపోయారు. ఇలా కెసిఆర్ గారు విద్యా వ్యవస్థను పూర్తిగా ఆగం చేస్తుండు. విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటున్న ఈ కెసిఆర్ సర్కార్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన గుణపాఠం చెబుతారు.'' అని విజయశాంతి అన్నార

Updated Date - 2022-11-30T23:19:30+05:30 IST

Read more