Vemula Prashanth Reddy: అర్వింద్‌పై కవిత వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి వేముల

ABN , First Publish Date - 2022-11-19T15:24:08+05:30 IST

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి సమర్థించారు.

Vemula Prashanth Reddy: అర్వింద్‌పై కవిత వ్యాఖ్యలను సమర్థించిన మంత్రి వేముల

హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ (Dharmapuri Arvind)పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC kavita) చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) సమర్థించారు. తండ్రి బిడ్డను అమ్ముకుంటుండు అని రాజకీయ చరిత్రలో ఎవరైనా అంటారా? అని ప్రశ్నించారు. వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడబిడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తోందన్నారు. అరవింద్ (BJP MP) అంటేనే నిలువెత్తు అబద్ధం, అబద్ధాల పుట్ట... రాజకీయాలకు కళంకమని మండిపడ్డారు. బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చి మాట తప్పిన ఏకైక నాయకుడు అరవింద్ అని మంత్రి అన్నారు.

బీజేపీ ఎంపీని గ్రామాల్లోకి ప్రజలు రానివ్వడం లేదన్నారు. ఖర్గేతో కవిత మాట్లాడినట్లు అరవింద్‌కు ఏమైనా కల పడిందా అని నిలదీశారు. తండ్రిని కాదని పార్టీలు మారే కుటుంబం అరవింద్ దే అని దుయ్యబట్టారు. అరవింద్ కుటుంబంలో ముగ్గురు ఉంటే.. ఆ ముగ్గురు మూడు పార్టీలలో ఉన్నారని యెద్దేవా చేశారు. ‘‘కవిత ఇంటిపై దాడి చేసిన్నప్పుడు గవర్నర్ మహిళగా ఎందుకు స్పందించలేదు.. ఇళ్లపైకి దాడులు చేసే ఆట మొదలు పెట్టింది ఎవరు?. మా కార్యకర్తలు గాజులు వేసుకుని ఉన్నారా?. ఉప్పు కారం తింటున్నాం మాకు కోపాలు రావా?’’ అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Telangana Minister) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-11-19T15:27:45+05:30 IST