TDP Chief: హైదరాబాద్ ఐఎస్‌బీ ఆవిర్భావ వేడుకలకు చంద్రబాబు
ABN , First Publish Date - 2022-12-15T11:40:33+05:30 IST
ఐఎస్‌బీ హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
హైదరాబాద్: ఐఎస్‌బీ హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుక (Hyderabad ISB Inauguration Ceremony)ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొననున్నారు. రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ఐఎస్‌బీ ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు టీడీపీ అధినేత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థులతో చంద్రబాబు (TDPChief) ముఖాముఖీ చర్చలో పాల్గొననున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేసిన విషయం తెలిసిందే. 2001లో నాటి ప్రధాన మంత్రి వాజ్ పేయి (Former Prime minister Vajpayee) చేతుల మీదుగా హైదరాబాద్ ఐఎస్‌బీ సంస్థ ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలు పోటీ పడినా ప్రతిష్టాత్మక సంస్థను నాడు రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది.