Telangana Highcourt: కాంగ్రెస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ABN , First Publish Date - 2022-12-15T12:10:30+05:30 IST

కాంగ్రెస్ వార్‌ రూమ్‌పై పోలీసులు దాడి చేసి సిబ్బందిని తీసుకెళ్లడంపై తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్‌ దాఖలు చేసింది.

Telangana Highcourt: కాంగ్రెస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్: కాంగ్రెస్ వార్‌ రూమ్‌ (Congress War Room)పై పోలీసులు దాడి చేసి సిబ్బందిని తీసుకెళ్లడంపై తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో కాంగ్రెస్ పిటిషన్‌ దాఖలు చేసింది. గురువారం ఉదయం కాంగ్రెస్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 18 గంటల పాటు అక్రమంగా పోలీసులు ముగ్గురిని తమ అదుపులోకి తీసుకున్నారని అన్నారు. అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. 24న వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ అయ్యిన 20 రోజులకు అదుపులోకి తీసుకున్నారని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 41 నోటీస్ ఇచ్చి ముగ్గురిని వదిలి పెట్టామని పోలీసులు తెలిపారు. ముగ్గురిని అక్రమంగా అదుపులోకి తీసుకునందున ఒక్కొక్కరికి రూ.20 లక్షలు కంపెన్సెషన్ ఇవ్వాలని న్యాయవాది కోరారు. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2022-12-15T12:10:31+05:30 IST