Komatireddy Venkatreddy: ఈరోజు మధ్యాహ్నం ప్రధానితో భేటీ అవుతా

ABN , First Publish Date - 2022-12-16T11:49:09+05:30 IST

నాలుగు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సమయం ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Komatireddy Venkatreddy: ఈరోజు మధ్యాహ్నం ప్రధానితో భేటీ అవుతా

న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime minister Narendra Modi) ని సమయం ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress MP Komatireddy Venkat Reddy) అన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రధానితో భేటీ అవనున్నట్లు తెలిపారు. మోదీని పార్లమెంట్‌లో కలువనున్నట్లు చెప్పారు. తెలంగాణలోని ముఖ్యమైన అంశాలపై చర్చిస్తానన్నారు. మూసినది ప్రక్షాళన నిధులు మంజూరు చేయాలని ప్రధాని కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్‌లు‌గా నిర్మాణం చేయాలని ప్రధాని కోరుతానన్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-16T11:49:44+05:30 IST