TS News: కార్ల రేసింగ్‌ను తప్పుబట్టిన బండిసంజయ్

ABN , First Publish Date - 2022-11-20T19:35:08+05:30 IST

Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం (TRS Govt) హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ంగ్ నిర్వహించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని బీజేపీ తప్పుబట్టింది.

TS News: కార్ల రేసింగ్‌ను తప్పుబట్టిన బండిసంజయ్

Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం (TRS Govt) హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ంగ్ నిర్వహించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్ల నగర ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని, అంబులెన్స్ సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలంగాణ బీజేపీ(BJP) చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. కార్ల రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్లను దిగ్బంధించడం ఎంతవరకు సమంజసం? ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజానీకానికి జరగరాని నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. కార్ల రేసింగ్ నిర్వహణకు తమ పార్టీ వ్యతిరేకం కాదంటూనే.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలని సూచించారు.

Updated Date - 2022-11-20T19:35:09+05:30 IST