వ్యాపారిని ఇంటికి తీసుకెళ్లి.. ఉద్యోగం అడిగిన మహిళ.. మరుక్షణం మరో మహిళతో కలిసి...

ABN , First Publish Date - 2022-11-06T21:36:57+05:30 IST

ఆడవారిని అడ్డు పెట్టుకుని నేరాలు చేసే ఘటనలు ఇటీవల కోకొళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులున్న వారిని టార్గెట్ చేసి, తర్వాత మాయమాటలతో వారికి దగ్గరవుతుంటారు. అదును చూసి చివరకు తమ..

వ్యాపారిని ఇంటికి తీసుకెళ్లి.. ఉద్యోగం అడిగిన మహిళ.. మరుక్షణం మరో మహిళతో కలిసి...
ప్రతీకాత్మక చిత్రం

ఆడవారిని అడ్డు పెట్టుకుని నేరాలు చేసే ఘటనలు ఇటీవల కోకొళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులున్న వారిని టార్గెట్ చేసి, తర్వాత మాయమాటలతో వారికి దగ్గరవుతుంటారు. అదును చూసి చివరకు తమ అసలు స్వరూపం బయటపెడుతుంటారు. డబ్బులు ఇవ్వని వారిని మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తుంటారు. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యాపారిని ఇంటికి తీసుకెళ్లిన మహిళ.. తనకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. తర్వాత కాసేటికే తన స్నేహితురాలితో కలిసి ఆమె చేసిన పనికి.. వ్యాపారి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

ఓ వైపు కూతురు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి చేసిన నిర్వాకం.. రోజూ చాక్లెట్లు ఇస్తూ..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సహరాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ తాహా అనే వ్యక్తి.. స్థానికంగా కలప వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార అవసరాల నిమిత్తం తరచూ ఢిల్లీకి (Delhi) వెళ్లి వస్తూ ఉంటాడు. ఇదిలావుండగా, నాలుగు నెలల క్రితం అతడికి ఓ మహిళ (woman) ఫోన్‌లో పరిచయమైంది. అప్పటినుంచి రోజూ మాట్లాడుతూ ఉండేది. ఓ రోజు మీతో కలవాలని ఉంది.. అని తరచూ అడుగుతుండేది. అక్టోబర్ 28న ఢిల్లీకి వెళ్లడంతో మహిళ.. వ్యాపారిని కలిసింది. అప్పటికే తన భర్త చనిపోయాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పింది. ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని అతన్ని వేడుకుంది. ఈ క్రమంలో ఆమె తన స్నేహితురాలిని కూడా ఫోన్‌లో పరిచయం చేసింది. తర్వాత వ్యాపారిని తీసుకుని లక్ష్మీనగర్‌లోని ఓ కార్యాలయానికి తీసుకెళ్లింది.

Viral Video: చాక్ పీస్‌తో ఈ యువతి వేసిన పెయింటింగ్ చూస్తే.. మతి పోవాల్సిందే..

అక్కడ అప్పటికే సదరు మహిళ స్నేహితురాలు కూడా ఉంది. వ్యాపారిని గదిలోకి తీసుకెళ్లి, తలుపులు వేశారు. తర్వాత ఇద్దరూ కలిసి అతడి దుస్తులను విప్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు అతడు నిరాకరించినా గట్టిగా అరుస్తామని బెదిరించారు. దీంతో వ్యాపారి వారు చెప్పినట్లే చేశాడు. తర్వాత కొందరు పోలీసు దుస్తుల్లో అక్కడికి వచ్చి, అతన్ని బ్లాక్‌మెయిల్ చేశారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే.. రూ.20లక్షలు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. తర్వాత వారికి రూ.20లక్షలు బాకీ ఉన్నట్లు, రెండు విడతలుగా ఇస్తానని.. వ్యాపారితోనే చెప్పించి వీడియో తీశారు. అప్పటి నుంచి అతన్ని డబ్బుల కోసం వేధిస్తుండడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం నిందితులను అరెస్ట్ చేశారు.

పెళ్లి సంబంధం చెడిపోవడమే మేలనుకున్న యువతి.. వంట మనిషి ఇచ్చిన ఓదార్పుతో.. ఓ రోజు భయంభయంగానే..

Updated Date - 2022-11-06T21:38:23+05:30 IST