Viral Video: చాక్ పీస్‌తో ఈ యువతి వేసిన పెయింటింగ్ చూస్తే.. మతి పోవాల్సిందే..

ABN , First Publish Date - 2022-11-06T20:11:15+05:30 IST

అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుత కళాఖండాలను సృష్టిస్తుంటారు కొందరు కళాకారులు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉండే కొన్ని పెయింటిగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. గతంలో ఇలాంటి పెయింటిగ్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు..

Viral Video: చాక్ పీస్‌తో ఈ యువతి వేసిన పెయింటింగ్ చూస్తే.. మతి పోవాల్సిందే..

అందుబాటులో ఉన్న వస్తువులతోనే అద్భుత కళాఖండాలను సృష్టిస్తుంటారు కొందరు కళాకారులు. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉండే కొన్ని పెయింటిగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. గతంలో ఇలాంటి పెయింటిగ్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and videos) చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువతి (young woman) చాక్ పీస్‌తో వేసిన పెయింటిగ్.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చూస్తుండగానే బోర్డుపై అద్భుతాన్ని ఆవిష్కరించిన ఈ యువతిపై.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

150 అడుగుల ఎత్తులో తలకిందులుగా వేలాడుతున్న 85ఏళ్ల వృద్ధుడు.. తీరా కింద పడిపోయే క్రమంలో..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Social media viral videos) అవుతోంది. ఓ యువతి బోర్డుపై పెయింటింగ్ (Paintings) వేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇందుకోసం ఎలాంటి బ్రష్‌లు, రంగులూ వాడదు. కేవలం ఒకే ఒక్క చాక్ పీస్ తీసుకుని బోర్డుపై అలవోకగా పెయింటింగ్ వేసేస్తుంది. చాక్ పీస్‌ను అడ్డంగా పట్టుకుని ఆమె గీస్తున్న గీతలు చూసి, ఏదో సాధారణ పెయింటింగ్ అని అనిపిస్తుంది. కానీ.. కాసేపటికే ఆమె గీసిన గీతలు.. వర్షంలో గొడుగు పట్టుకుని ఉన్న యువతి, యువకుడుగా మారిపోతాయి. పెయింటింగ్ పూర్తయ్యాక చూస్తే.. నిజంగా దీన్ని చాక్ పీస్‌తో గీయడం సాధ్యమా.. అని అనిపించకమానదు. అంతలా ఆ యువతి వేసిన పెయింటింగ్.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ యువతి ప్రతిభ.. అమోఘం.. అంటూ కొందరు.. ఇది మేము నమ్మలేకున్నాం.. అద్భుతం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి సంబంధం చెడిపోవడమే మేలనుకున్న యువతి.. వంట మనిషి ఇచ్చిన ఓదార్పుతో.. ఓ రోజు భయంభయంగానే..

Updated Date - 2022-11-06T21:24:03+05:30 IST