డాక్టర్ అయి ఉండి ఇదేం పాడు బుద్ధి.. అర్ధరాత్రిళ్లు ఫుట్‌పాత్‌ల వద్దకు వెళ్లి మరీ..

ABN , First Publish Date - 2022-12-13T16:14:07+05:30 IST

ఓ డాక్టర్ అతని స్నేహితులు ముగ్గురు రెండు బైక్ లపై వస్తున్నారు. వారు దూరం నుండే పోలీసులను చూశారు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న పెద్ద ప్యాకెట్స్ పడేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే..

డాక్టర్ అయి ఉండి ఇదేం పాడు బుద్ధి.. అర్ధరాత్రిళ్లు ఫుట్‌పాత్‌ల వద్దకు వెళ్లి మరీ..

ఓ డాక్టర్ అతని స్నేహితులు ముగ్గురు రెండు బైక్ లపై వస్తున్నారు. వారు దూరం నుండే పోలీసులను చూశారు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న పెద్ద ప్యాకెట్స్ పడేసి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు నలుగురుని చుట్టుముట్టడంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఇంతకూ అ డాక్టర్ తన స్నేహితులతో కలిసి చేసిన నేరమేమిటి? వారెందుకలా పారిపోయారు వంటి విషయాలలోకి వెళితే...

రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం భరత్ పూర్‌కు చెందిన ఒక డాక్టర్ (Doctor) తన స్నేహితులతో కలసి రాత్రి సమయంలో ఫుట్‌పాత్ మీద దుప్పట్లు అమ్ముకుంటున్న వ్యాపారి నుండి దుప్పట్లు దొంగతనం (theft) చేసాడు. రాత్రి సమయంలో వ్యాపారి నిద్రపోతున్నప్పుడు టార్పాలిన్ కవర్ ను కోసి అందులో ఉన్న దుప్పట్లలో 8 దుప్పట్లను చేజిక్కించుకుని పారిపోయారు. విషయం గమనించుకున్న వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు అప్పటికప్పుడే ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వెతకడం మొదలుపెట్టారు.

doctor.jpg

అంతలోనే నలుగురు యువకులు బైక్‌పై వస్తుండటం పోలీసులకు కనిపించింది. లేట్ నైట్ పార్టీలు చేసుకుని వస్తున్నారేమోనని పోలీసులు పొరబడ్డారు. అయితే వారు పోలీసులను చూసి కంగారుతో తమ దగ్గరున్న ప్యాకెట్స్‌ను పడేసి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో వారు దొరికిపోయారు. వారిలో ఒక మైనర్ ఉండటంతో అతన్ని కేవలం అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో శైలేంద్ర అనే వ్యక్తి హోమియోపతి డాక్టర్ గా 8నెలల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాడట. అతను సూటూ బూటూ వేసుకుని ఎంతో దర్జాగా ఉన్నాడని.. అతను ఇలాంటి పని చేశాడంటే నమ్మలేకపోయామని పోలీసులు చెప్పారు. అతని జీతం నెలకు 20వేల రూపాయలట. వ్యాపారి నుండి దొంగిలించిన దుప్పట్లు 5వేల రూపాయల విలువ చేస్తాయని తెలిసింది. ఈ విషయం గురించి విన్న నెటిజన్లు ఓ మంచి వృత్తిని ఎంచుకున్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..

Updated Date - 2022-12-13T16:14:07+05:30 IST

Read more