వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ రాత్రి భార్యతో వాగ్వాదానికి దిగిన భర్త.. ఉదయం చుట్టుపక్కల వారు గదిలోకి వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2022-12-13T21:04:05+05:30 IST

కూలి పనులు చేసుకుంటూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కూడా అతడికి చేదోడువాదోడుగా ఉండేది. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన అతడి ప్రవర్తనలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఎవరితోనో..

వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ రాత్రి భార్యతో వాగ్వాదానికి దిగిన భర్త.. ఉదయం చుట్టుపక్కల వారు గదిలోకి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

కూలి పనులు చేసుకుంటూ కుంటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య కూడా అతడికి చేదోడువాదోడుగా ఉండేది. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన అతడి ప్రవర్తనలో ఇటీవల చాలా మార్పు వచ్చింది. ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ వేధించసాగాడు. ఇటీవల ఓ రోజు రాత్రి మళ్లీ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఉదయం స్థానికులు చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

దారుణం.. 5 ఏళ్ల బాలుడి కాళ్లను పట్టుకుని.. గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు..!

రాజస్థాన్‌లోని (Rajasthan) సవాయ్ మాధోపూర్‌ పరిధి ఖండర్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా అశోక్ సాహు, సులోచన(30) అనే దంపతులు (couple) నివాసం ఉంటున్నారు. అశోక్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య కూడా అతడికి చేదోడువాదోడుగా ఉండేది. ఇన్నాళ్లూ సంతోషంగా సాగిన వీరి కుటుంబంలో ఇటీవల సమస్యలు (problems) తలెత్తాయి. భార్య వేరే ఎవరితోనే వివాహేతర సంబంధం (extramarital affair) పెట్టుకుందని అశోక్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో రోజూ ఇదే విషయమై భార్యను వేధించేవాడు. అయితే తాను ఎలాంటి తప్పూ చేయలేదని భార్య ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకునేవాడు కాదు. ఆదివారం రాత్రి కూడా భార్యతో గొడవపడ్డాడు. కొద్ది సేపటి తర్వాత భార్య వేరే గదిలోకి వెళ్లి పడుకుంది.

డాక్టర్ అయి ఉండి ఇదేం పాడు బుద్ధి.. అర్ధరాత్రిళ్లు ఫుట్‌పాత్‌ల వద్దకు వెళ్లి మరీ..

అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న అశోక్.. అర్ధరాత్రి గొడ్డలి తీసుకుని భార్య గదిలోకి వెళ్లాడు. పడుకుని ఉన్న ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. అప్పటి వరకూ బాగున్న ఆమె.. ఇలా రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకున్నారు. ఇటీవల అజ్మీర్ అనే ప్రాంతంలో ఓ వ్యక్తి వివాహమైన 26వ రోజే భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇలాంటి దారుణాలకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మసాజర్ కోసం వెతుకుతుండగా.. ఆన్‌లైన్‌లో కనిపించిన భార్య ఫొటోలు.. అందులో ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయగా...

Updated Date - 2022-12-13T21:06:32+05:30 IST

Read more