మామ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి.. పొద్దున లేచిన కూతుళ్లు షాక్..

ABN , First Publish Date - 2022-12-04T17:01:55+05:30 IST

కూతుళ్లకు కష్టం వస్తే తట్టుకోలేని తండ్రులు ఉన్నట్లే.. కూతుళ్లను కష్టపెట్టే శాడిస్టు తండ్రులు కూడా ఉంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుళ్లపైనే..

మామ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పడంతో.. నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి.. పొద్దున లేచిన కూతుళ్లు షాక్..
ప్రతీకాత్మక చిత్రం

కూతుళ్లకు కష్టం వస్తే తట్టుకోలేని తండ్రులు ఉన్నట్లే.. కూతుళ్లను కష్టపెట్టే శాడిస్టు తండ్రులు కూడా ఉంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుళ్లపైనే.. కన్నేస్తుంటారు. సభ్యసమాజం తల దించుకునే ఇలాంటి ఘటనలు మన చట్టూ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మామ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కూతుళ్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. దీంతో కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చిన తండ్రి చివరకు దారుణానికి పాల్పడ్డాడు. పొద్దున లేచి విషయం తెలుసుకున్న కూతుళ్లు షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఆ పని చేయాలంటూ కూతురిపై తల్లి ఒత్తిడి.. వీడియోలను బయటపెట్టిన యువతి చివరకు ఏం చేసిందంటే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దుర్గ్ జిల్లా ఖుర్సిపర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి.. 15ఏళ్లు, 21ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు. ఇదిలావుండా, అక్కడ మామ వరుసయ్యే వ్యక్తి.. వారిద్దరిపై కన్నేశాడు. ఓ రోజు ఇంట్లో భార్య లేని సమయంలో వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు వారిని శారీరకంగా (Indecent behavior)వేధించాడు. దీంతో విసిగిపోయిన వారు.. ఇంటికి వెళ్లి విషయం తండ్రికి తెలిపారు.

లిఫ్ట్ అడిగి మరీ మహిళా ప్రొఫెసర్‌ కారులో ఎక్కాడు.. ‘‘మేడం నా ఫోకస్ అంతా మీ పైనే’’ అంటూ నవ్వుతూనే..

అయితే అతన్ని వారించాల్సిన తండ్రి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి వేర్వేరు గదుల్లో పడుకోబెట్టాడు. రాత్రి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొద్దున లేచిన వారికి విషయం తెలిసింది. అయితే బయట ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయారు. రోజూ ఇలాగే చేస్తుండడంతో అక్టోబర్‍‌లో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కూతుళ్లు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తండ్రి, మామ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అబార్షన్ చేయించేందుకు ప్రియురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. మద్యం సేవించిన డాక్టర్ చివరకు..

Updated Date - 2022-12-04T17:02:10+05:30 IST