అబార్షన్ చేయించేందుకు ప్రియురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. మద్యం సేవించిన డాక్టర్ చివరకు..

ABN , First Publish Date - 2022-12-02T21:31:52+05:30 IST

వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చివరకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ప్రేమాయణం సాగించారు. అయితే ఈ క్రమంలో ఇటీవల యువతి గర్భం దాల్చింది. బయట తెలిస్తే..

అబార్షన్ చేయించేందుకు ప్రియురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. మద్యం సేవించిన డాక్టర్ చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం చివరకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ప్రేమాయణం సాగించారు. అయితే ఈ క్రమంలో ఇటీవల యువతి గర్భం దాల్చింది. బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ప్రియుడు ఆమెకు అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అబార్షన్ పేరుతో వైద్యుడు ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచుకున్నాడు. మద్యం సేవిస్తూ అతడు చేసిన వైద్యానికి చివరకు దారుణం జరిగింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

చెప్పింది కాకుండా మరో బ్రాండ్ సర్ఫ్‌ను కొని తెచ్చాడట.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిందో భార్య..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ పరిధి మందిర్ హసౌద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక లఖోలి పరిధికి చెందిన 18 ఏళ్ల యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే ఇటీవల యువతి గర్భం దాల్చింది. దీంతో బయటికి తెలిస్తే పరువు పోతుందని ఆమె భయపడిపోయింది. ఈ క్రమంలో ప్రియుడు.. ఆమెకు అబార్షన్ (Abortion) చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఆమెను ఓ నకిలీ వైద్యుడి (fake doctor) వద్దకు తీసుకెళ్లాడు. యువతిని మూడు రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని వైద్యం చేశాడు. అయితే చివరకు యువతి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరకు పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీ.. సడన్‌గా కిటికీ వైపు నుంచి దూసుకొచ్చిన మృత్యువు..

మద్యం తాగి వైద్యం చేయడంతోనే ఇలా జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యలు, స్థానికులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఇలాగే చేశాడని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి ప్రియుడు ఈశ్వర్ ధూర్వా, నకిలీ వైద్యుని అరెస్ట్ చేశారు. నకీలి వైద్యుల కారణంగా గతంలో ఇలాంటి మరణాలు సంభవించాయి. జాంజ్‌గిరిలో 11 రోజుల క్రితం నకిలీ వైద్యుడి కారణంగా ఓ యువకుడు మృతి చెందాడు. అలాగే సుర్గుజా జిల్లాలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న ఓ రెండేళ్ల బాలికను మంగళవారం వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే వైద్యుడు బాలికకు ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిముషాలకే అస్వస్థతకు గురైంది. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి.. ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పదేళ్ల పిల్లాడికి ఏడాది నుంచి విపరీతమైన కడుపునొప్పి.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే కడుపులో 100 గ్రాముల పరిమాణంలో..

Updated Date - 2022-12-02T21:31:55+05:30 IST