Viral Video: ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెప్పగలరా.. మహా అయితే ఐదు అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..

ABN , First Publish Date - 2022-12-28T15:36:25+05:30 IST

కొన్ని చిత్రాలు, సన్నివేశాలు చూసినప్పడు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇది నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మన కళ్లకు పరీక్ష పెట్టే ఇలాంటి ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో ..

Viral Video: ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయో చెప్పగలరా.. మహా అయితే ఐదు అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..

కొన్ని చిత్రాలు, సన్నివేశాలు చూసినప్పడు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇది నిజమేనా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మన కళ్లకు పరీక్ష పెట్టే ఇలాంటి ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ (Viral photos and videos) అవుతుంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో కూడా ఇలాంటిదే. నీళ్లు తాగుతున్న ఏనుగుల ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే చూసేందుకు అక్కడ నాలుగు ఏనుగులు మాత్రమే కనిపిస్తాయి. కానీ వీడియో చూస్తే.. అరే..! అక్కడ ఇన్ని ఏనుగులు ఉన్నాయా.. అని ఆశ్యర్యం కలుగుతుంది. ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు.. కొన్నాళ్లకు అతిథి గృహంలో ప్రత్యక్షం.. ఓ రోజు రాత్రి బాలిక ఫొటోను చేతిలో పట్టుకుని..

ఏనుగులకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా (elephants Viral videos) మారింది. ఓ నది పక్కన కొన్ని ఏనుగులు నీళ్లు తాగుతూ ఉంటాయి. చూసేందుకు అక్కడ నాలుగు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయని ఎవరైనా అడిగితే.. నాలుగు, లేకపోతో ఐదు ఉండొచ్చని అంతా అనుకుంటారు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో చూస్తే.. అవాక్కవడం మన వంతవుతుంది. చూసేందుకు నాలుగు మాత్రమే ఉంటాయి. కానీ నీళ్లు తాగిన వెంటనే తిరిగి వెళ్లే సమయంలో.. వాటి వెనుక దాక్కున్న ఓ ఏనుగు పిల్ల ముందుగా బయటకు వస్తుంది. ఇంకాస్త వెళ్లగానే మరో ఏనుగు పిల్ల వాటి మధ్యలో కనిపిస్తుంది. అలాగే మరుక్షణంలో ఇంకో ఏనుగు పిల్ల.. తన తల్లి ఏనుగు పక్కనే నడుచుకుంటూ వెళ్లడం.. వీడియోలో చూడొచ్చు. దీంతో అక్కడ మొత్తం ఏడు ఏనుగులు (Seven elephants) ఉన్నాయనే విషయం వీడియో చూస్తేగానీ అర్థం కాదు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియో చూసేయండి.

Viral Video: పని మనిషిని లిఫ్ట్ నుంచి బలవంతంగా లాక్కెళ్లిన యజమాని.. వద్దని వేడుకుంటున్నా వినకుండా..

Updated Date - 2022-12-28T15:44:37+05:30 IST