రే చిన్నా.. ఇలా జరిగిందేంట్రా.. జన్మంటూ ఉంటే ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రం పుట్టకు..

ABN , First Publish Date - 2022-11-26T20:33:46+05:30 IST

గారాబంగా చూసుకుంటున్న తల్లిదండ్రులే చివరకు తన పాలిట మృత్యువుగా మారతారని.. పాపం ఆ మూడు నెలల చిన్నారికి తెలీదు. ఒక్కగానొక్క కొడుకును ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన తండ్రి..

రే చిన్నా.. ఇలా జరిగిందేంట్రా.. జన్మంటూ ఉంటే ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రం పుట్టకు..

గారాబంగా చూసుకుంటున్న తల్లిదండ్రులే చివరకు తన పాలిట మృత్యువుగా మారతారని.. పాపం ఆ మూడు నెలల చిన్నారికి తెలీదు. ఒక్కగానొక్క కొడుకును ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన తండ్రి.. భార్య మీద కోపాన్నంతా కొడుకు మీద చూపించిన విషాద ఘటన శ్రీకాళహస్తి మండలంలో చోటు చేసుకుంది. చిన్నారి మృతితో పగవారు సైతం కన్నీటిపర్యంతమవుతున్నారు. ‘‘ చిన్నా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాంటి తల్లిదండ్రులకు మాత్రం పుట్టకు’’.. అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళితే..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఇలాంటి వివాహం ఇప్పటిదాకా జరగలేదట.. అంతమంది పోలీసులు ఎందుకొచ్చారంటే..

దంపతుల మధ్య తలెత్తిన ఆక్రోశానికి ముక్క పచ్చలారని మూడు నెలల పసిబిడ్డ బలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లాలో శనివారం వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శ్రీకాళహస్తి (Srikalahasti) మండలం వేడాం పంచాయతీలోని చిన్నమిట్టకండ్రిగ గ్రామానికి చెందిన మునిరాజా అలియాస్‌ అనిల్‌కుమార్‌ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన స్వాతితో రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం (love marriage) జరిగింది. ఉపాధి నిమిత్తం శ్రీకాళహస్తి పట్టణంలోని వాటర్‌హౌస్‌ కాలనీలో కాపురం ఉంటున్నారు. మూడు నెలల క్రితం ఈ దంపతులకు నిఖిల్‌ అనే మగబిడ్డ జన్మించాడు. వివాహం అయినప్పటి నుంచి దంపతుల కుటుంబాల మధ్య కలహాలు మొదలయ్యాయి. అత్తమామలతో స్వాతి మాట్లాడడం కూడా మానేసింది. ఈ క్రమంలో పలుమార్లు ఇరు కుటుంబాల (Family quarrels) మధ్య గొడవలు జరిగాయి.

Dual Sim Cards: ఒకే ఫోన్‌లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్‌కు శుభం కార్డు పడబోతోందా..?

ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి చిన్నారి నిఖిల్‌ అనారోగ్యానికి గురయ్యాడు. పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. ఆస్పత్రి ఖర్చుల కోసం మునిరాజ తన ద్విచక్రవాహనాన్ని కూడా అమ్మేశాడు. మనవడికి జ్వరమని తెలిసి మునిరాజ తల్లిదండ్రులు కుమారుడి ఇంటికి వచ్చారు. శుక్రవారం రాత్రి కూడా బిడ్డకు తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చారు. అయితే తాను మామ ద్విచక్రవాహనంపై రానంటూ స్వాతి చెప్పడంతో అత్తాకోడళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ వైపు తల్లి, భార్య పెనుగులాడుకుంటూ ఉండడం, మరో వైపు అనారోగ్యంతో బిడ్డ రోదిస్తూ విలవిలలాడిపోతుండడంతో ఆ తండ్రి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు.

వైద్య విద్యకు మధ్యలోనే పులుస్టాప్.. UPSC ఫలితాల్లో నాలుగో ర్యాంక్.. ఈమె సక్సెస్ స్టోరీ ఇదీ..!

క్షణికావేశంతో సిమెంటు రోడ్డుపై బిడ్డను నేలకేసి కొట్టడంతో ఒకసారిగా ఆపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే పసివాడి ప్రాణం పోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి వన్‌టౌన్‌ సీఐ అంజుయాదవ్‌ శనివారం ఉదయం మునిరాజ ఇంటికి చేరుకుని బిడ్డ మృతదేహాన్ని పరిశీలించారు. మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి తిరిగి కుటుంబసభ్యులకు అప్పగించారు. పసిబిడ్డ మృతికి కారణమైన తండ్రి మునిరాజను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కుటుంబ కలహాలకు అన్యం పుణ్యం ఎరుగని చిన్నారి బలవడంపై స్థానికులంతా కన్నీటిపర్యంతమయ్యారు.

ఫొటో తీయాలంటూ.. మహిళను ముఖం కడుక్కుని రమ్మన్న యువకులు.. కాసేపటికి..

Updated Date - 2022-11-26T20:34:10+05:30 IST