Chandrababu: నా రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా.. అలా జరగాలంటే..

ABN , First Publish Date - 2022-12-01T22:57:59+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN)పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu) విమర్శలు గుప్పించారు.

Chandrababu: నా రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా.. అలా జరగాలంటే..

కొవ్వూరు: (తూర్పుగోదావరి) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JAGAN)పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu) విమర్శలు గుప్పించారు. చరిత్రలో ఇటువంటి సీఎంను చూశారా అని, ఐరన్ లెగ్ వచ్చింది.. పోలవరం మీద పడిందని చంద్రబాబు ఆరోపించారు. చిన్న బిడ్డను పెంచినట్లు పోలవరం పెంచానని.. అటువంటి దానిని ముంచేశారని విమర్శించారు. తెలంగాణలో అప్పుడు వచ్చిన సీఎంలు జగన్ కంటే మంచోళ్ళని చంద్రబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి హైటెక్ సిటీని పడగొట్టి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి చెందేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ వస్తూనే ప్రజా వేదికను కూలగొట్టాడని, ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని చంద్రబాబు తెలిపారు. తన రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా,.. అలా జరగాలంటే రెండు రాష్ట్రాలు కలవాలని, కలిసే అవకాశం లేదని బాబు అన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా తాకట్టు పెట్టారా అని, ఈ సీఎం జగన్ పెట్టాడని బాబు మండిపడ్డారు. అప్పులు చేసే సీఎం గొప్పవాడా.. సంపద సృష్టించే సీఎం గొప్పవాడా ప్రజలే తేల్చుకోవాలన్నారు. అమరావతి పూర్తయి ఉంటే మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని, అటువంటి అమరావతిని కులం ముద్ర వేసి, నాశనం చేశారని కొవ్వూరులో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-01T23:29:17+05:30 IST