Viral News: ఈ ఫొటో చూసి.. అందరిలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే..

ABN , First Publish Date - 2022-12-28T15:46:13+05:30 IST

తలకు బ్యాండేజ్, ముక్కులో కాటన్‌తో ఫొటో కనిపిస్తే.. సాధారణంగా ఎవరైనా ఏం అనుకుంటారు.. సదరు ఫొటోలోని వ్యక్తి/మహిళ మరణించినట్టు భావిస్తారు. అయితే.. పైన కనిపిస్తున్న ఫొటో చూసి కూడా అలానే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే..

Viral News: ఈ ఫొటో చూసి.. అందరిలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే..

ఇంటర్నెట్ డెస్క్: తలకు బ్యాండేజ్, ముక్కులో కాటన్‌తో ఫొటో కనిపిస్తే.. సాధారణంగా ఎవరైనా ఏం అనుకుంటారు.. సదరు ఫొటోలోని వ్యక్తి/మహిళ మరణించినట్టు భావిస్తారు. అయితే.. పైన కనిపిస్తున్న ఫొటో చూసి కూడా అలానే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆమె చనిపోలేదు. మరి తను ఎందుకు అలా చేసిందనేగా మీ సందేహం? దాని వెనకాల ఓ పెద్ద స్కెచ్ ఉంది. కానీ ఆమె కూతురే.. తన ప్లాన్‌ను ప్లాఫ్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఆమె ఎవరు? అలా ఎందుకు చేసింది? ఆ మహిళ ప్లాన్ ఎలా బెడిసికొట్టింది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆమె పేరు ఎల్(L). ఇండోనేషియా(Indonesia)కు చెందిన ఈమె తన అవసరాల కోసం మాయా అనే మహిళ వద్ద అప్పు తీసుకుంది. ఆ మొత్తాన్ని నవంబర్ 20 తేదీ లోపు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చింది. అయితే.. సమయం దాటిపోయినా ఆమె ఆ డబ్బును మాత్రం తిరిగి చెల్లించలేదు. దీంతో ఎల్‌పై మాయా ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో ఆమె గడువు పొడిగించాలని కోరింది. డిసెంబర్ 6 వరకు టైం ఇస్తే.. డబ్బును చెల్లిస్తానని పేర్కొంది. దానికి మాయా ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఆ డబ్బులను ఎగ్గొట్టడానికి ఎల్ ప్లాన్ వేసింది. తను చనిపోయినట్టు తలకు బ్యాండేజ్, ముక్కులో కాటన్ పెట్టుకుని, స్ట్రెచర్‌పై డెడ్ బాడీ ఉన్నట్టు ఫొటోలు దిగింది. అనంతరం ఆ ఫొటోలను తన కూతురుకి తెలియకుండానే ఆమె అకౌంట్ నుంచి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘నార్త్ సుమత్ర ప్రాంతంలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో మా అమ్మ చనిపోయింది. ఇండోనేషియాలోని Banda Aceh నగరంలో అంత్యక్రియలు జరగుతాయి’ అంటూ ఆమె కూతురే పెట్టినట్టు ఫేస్‌బుక్‌(Facebook)లో ఫేక్ పోస్టు(Indonesia Woman Announced her Death) పెట్టింది.

ఇది కూడా చదవండి: Canada: ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన భారతీయుడు.. తాజాగా జరిగిన దుర్ఘనటలో..

డిసెంబర్ 12న ఈ పోస్టును మాయా చూసింది. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఎల్ కూతురు కూడా ఆ పోస్ట్‌ను చూసింది. దీంతో వెంటనే ఆ పోస్ట్ పచ్చి అబద్ధం అనీ.. తన తల్లి బాగానే ఉందని పేర్కొంటూ.. ఎల్ టీవీ చూస్తున్న ఫొటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మాయా కంగుతింది. ఈ సందర్భంగా మాయా లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లలేదని.. తన డబ్బులను ఎల్ తిరిగి ఇస్తుందని నమ్ముతున్నట్టు వెల్లడించింది. అయితే.. ఎల్ ఇంత వరకు తనను సంప్రదించలేదని పేర్కొంది. దీంతో ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-12-28T15:50:39+05:30 IST