Rahul Gandhi: హీరాబెన్ మోదీ మృతిపై రాహుల్ గాంధీ ట్వీట్

ABN , First Publish Date - 2022-12-30T09:43:30+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ శుక్రవారం అహ్మదాబాద్‌లో మృతి చెందడం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.

Rahul Gandhi: హీరాబెన్ మోదీ మృతిపై రాహుల్ గాంధీ ట్వీట్
Heerabas demise

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) శుక్రవారం అహ్మదాబాద్‌లో మృతి చెందడం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.(Rahul Gandhi tweets)‘‘ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణ వార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో మోదీకి, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) శుక్రవారం అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.(Demise) తన తల్లి అంతిమ యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ కన్నీళ్లతో తన తల్లి భౌతికకాయాన్ని మోస్తూ కనిపించారు.

Updated Date - 2022-12-30T09:43:32+05:30 IST