Heeraba last rites: హీరాబెన్ అంత్యక్రియలు ప్రారంభం...తల్లి పార్థివదేహాన్ని మోసిన మోదీ

ABN , First Publish Date - 2022-12-30T08:51:05+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం గాంధీనగర్ లో ప్రారంభమయ్యాయి...

Heeraba last rites: హీరాబెన్ అంత్యక్రియలు ప్రారంభం...తల్లి పార్థివదేహాన్ని మోసిన మోదీ
PM Modi carries mortal

గాంధీనగర్ (గుజరాత్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం గాంధీనగర్ లో ప్రారంభమయ్యాయి.(PM Modi carries mortal)ప్రధాని మోదీ కాన్వాయ్ ఆయన తల్లి హీరాబెన్ నివాసానికి చేరుకుంది.గాంధీనగర్‌లో మోదీ కుటుంబసభ్యులు హీరాబెన్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.(Heeraba last rites)గాంధీనగర్‌లోని సెక్టార్ 30 శ్మశాన వాటికలో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హీరాబెన్ అంత్యక్రియలకు ప్రధాని మోదీతోపాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. అంత్యక్రియలు జరిగుతున్న ఘటనాస్థలికి రావద్దని కుటుంబసభ్యులకు స్థలం ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలను ప్రధాని కోరారు.

అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో హీరాబెన్ మరణించారనే వార్త వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజల నుంచి సంతాపాలు, నివాళులు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు.

ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంతాపం తెలిపారు‘‘నరేంద్ర మోదీజీ తల్లి శ్రీమతి హీరాబెన్ మోదీ మరణవార్త వినడం బాధాకరం. దానిని భరించే శక్తి ప్రధానికి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరాఠీలో ట్వీట్ చేశారు.వందే భారత్ రైలు ప్రారంభోత్సవం, రైల్వే ఇతర అభివృద్ధి పనులు, జాతీయ గంగా కౌన్సిల్ సమావేశం ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారని పీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-12-30T09:37:14+05:30 IST