Telugu Universityలో దూరవిద్య కోర్సులు

ABN , First Publish Date - 2022-12-29T14:09:28+05:30 IST

హైదరాబాద్‌ (Hyderabad)లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాని (Telugu University)కి చెందిన దూరవిద్య కేంద్రం - వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిని తెలుగు మాధ్యమం (Telugu medium)లో నిర్వహిస్తారు.

Telugu Universityలో దూరవిద్య కోర్సులు
దూరవిద్య కోర్సులు

హైదరాబాద్‌ (Hyderabad)లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాని (Telugu University)కి చెందిన దూరవిద్య కేంద్రం - వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిని తెలుగు మాధ్యమం (Telugu medium)లో నిర్వహిస్తారు. కాంటాక్ట్‌ క్లాసెస్‌ ద్వారా బోధన ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ (sms) ద్వారా తెలియజేస్తారు. ఇక్కడ ప్రవేశం పొందినవారిని మరే ఇతర కోర్సులు చేయడానికి అనుమతించరు. కోర్సులకు నిర్దేశించిన వ్యవధికి రెట్టింపు సమయంలోగా పూర్తిచేయాలి. లేదంటే ప్రవేశాన్ని రద్దు చేస్తారు. బ్యాక్‌లాగ్‌ పేపర్లకు మినహా అన్నింటికీ బెటర్‌మెంట్‌ ఎగ్జామ్‌ రాసుకొనే వీలుంది. రెంటికీ విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి ఎంచుకొన్న కోర్సును మార్చుకొనే వీలు లేదు. శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడి, వరంగల్‌లలో ప్రాంతీయ ప్రాంగణాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల(Telugu states) అభ్యర్థులు తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. అభ్యర్థులకు బస్‌పాస్‌ ఇవ్వరు. వసతి సౌకర్యాలు కల్పించరు. అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులు కోర్సు ఫీజు చెల్లించిన వెంటనే సంబంధిత స్టడీ మెటీరియల్‌(Study material) అందిస్తారు. కోర్సు పూర్తయ్యేవరకు ఫీజు కట్టిన రశీదులు, ఐడీ కార్డ్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను జాగ్రత్త చేసుకోవాలి.

journalism.gif

పీజీ డిప్లొమా ఇన్‌ టెలివిజన్‌ జర్నలిజం: ఈ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో టెలివిజన్‌ చరిత్ర, టెలివిజన్‌ రిపోర్టింగ్‌, టెలివిజన్‌ స్ర్కిప్ట్‌ రచన, టెలివిజన్‌ ప్రొడక్షన్‌ పేపర్లు ఉంటాయి. ఎనిమిది నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ న్యూస్‌ ఫీచర్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ వర్క్‌ కూడా చేయాల్సి ఉంటుంది. మొత్తం మార్కులు 500. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.6,300. పరీక్ష ఫీజు రూ.1,200

డిప్లొమా ఇన్‌ లైట్‌ మ్యూజిక్‌(లలిత సంగీతం): కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో అయిదు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 చొప్పున మొత్తం మార్కులు 500. మొదటి ఏడాది సిద్ధాంతం (థియరీ), ప్రాయోగికం(ప్రాక్టికల్‌) పేపర్లు ఉంటాయి. రెండో ఏడాది పై రెండు పేపర్లతోపాటు ప్రాయోగికం(వాద్య పరికరాలు) పేపర్‌ అదనంగా ఉంటుంది. తెలుగు రాయడం, చదవడం తెలిసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. లలిత సంగీతంపై ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కోర్సు ఫీజు ఏడాదికి రూ.3,900. పరీక్ష ఫీజు మొదటి ఏడాది రూ.800, రెండో ఏడాది రూ.1200.

iStock-1017035796.gif

సంగీత విశారద: కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఏటా లక్షణం (సిద్ధాంతం), లక్ష్యం (ప్రాయోగికం) అనే రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌కు 100 మార్కులు. సంగీతంపై ఆసక్తి ఉన్నవారందరూ అర్హులే. కోర్సులో చేరేనాటికి అభ్యర్థుల వయసు పన్నెండేళ్లు నిండి ఉండాలి. కోర్సు ఫీజు ఏటా రూ.2,000. పరీక్ష ఫీజు మొదటి అయిదేళ్లు ఏటా రూ.800 చివరి ఏడాది రూ.1,200.

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ మోడరన్‌ తెలుగు: కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. భాషాభ్యసనంపై రెండు పేపర్లు, మౌఖిక పరీక్షకు సంబంధించి ఒక పేపర్‌ ఉంటాయి. మొత్తం మార్కులు 200. పదోతరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సుని తెలుగు భాషేతరుల సౌలభ్యం కోసం ఉద్దేశించారు. ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.1,400. పరీక్ష ఫీజు రూ.1,200

Film-Lighting.gif

డిప్లొమా ఇన్‌ ఫిల్మ్‌ రైటింగ్‌: కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో ఫిల్మ్‌ స్ర్కిప్ట్‌ రైటింగ్‌ - ఫండమెంటల్స్‌, రైటర్‌ - స్ర్కీన్‌ప్లే, ఫిల్మ్‌ స్ర్కిప్ట్‌ రైటింగ్‌ - ప్రాక్టికల్స్‌ అనే మూడు పేపర్‌లు ఉంటాయి. మొత్తం మార్కులు 300. పదోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.7,500. పరీక్ష ఫీజు రూ.1,200.

పీజీ డిప్లొమా ఇన్‌ జ్యోతిర్వాస్తు: కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో వాస్తు శాస్త్రం - ఆధునిక నిర్మాణ శిల్పం(ఆర్కిటెక్చర్‌), ఆధునిక వాస్తు కళ(వాస్తు బేసిక్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), జ్యోతిషశాస్త్రం - ప్రాథమిక అంశాలు, దేవాలయ వాస్తు - శిల్పరీతులు అనే నాలుగు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 400. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.4,800. పరీక్ష ఫీజు రూ.1,200

astrology.gif

డిప్లొమా ఇన్‌ జ్యోతిషం: కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో ఖగోళ విజ్ఞానం - ప్రాచ్య - పాశ్చాత్య పద్ధతులు, ముహూర్తం - గోచారం - శాంతి ప్రక్రియలు, వాస్తు - ప్రశ్న - వైద్య జ్యోతిషం అనే మూడు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.3,200. పరీక్ష ఫీజు రూ.1,200

సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ జ్యోతిషం: కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో జ్యోతిషశాస్త్రం - ప్రాథమిక అంశాలు - స్వరూప స్వభావాలు, జ్యోతిషశాస్త్రం - ఫలనిర్ణయ విధానాలు అనే రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 200. పదోతరగతి ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు రూ.2,000. పరీక్ష ఫీజు రూ.1,200

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 ఫిబ్రవరి 28

దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలు: పదోతరగతి సర్టిఫికెట్‌; ఇంటర్‌/ డిగ్రీ సర్టిఫికెట్‌, మార్కుల పత్రాలు; ఆధార్‌ కార్డ్‌లకు సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింక్‌: http://pstu.softelsolutions.in

వెబ్‌సైట్‌: teluguuniversity.ac.in

Updated Date - 2022-12-29T14:16:47+05:30 IST