Maddipati Venkataraju: ప్రజల కష్టాలు తీరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది
ABN , First Publish Date - 2022-12-13T20:33:47+05:30 IST
గోపాలపురం టీడీపీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ద్వారాకతిరుమల మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీలో 'ఇదేం కర్మ' రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఏలూరు: గోపాలపురం టీడీపీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ద్వారాకతిరుమల మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీలో 'ఇదేం కర్మ' రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరాజు గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు, పెరిగిన విద్యుత్ చార్జీలు, రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీని గెలిపించి రాష్ట్రంలో 175కి 175 నియోజవర్గాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామన్నారు. పులివెందులలో సైతం టీడీపీ గెలుస్తుందని వెంకటరాజు అన్నారు.