Nadendla Manohar: సజ్జల రెండు రాష్ట్రాలకు క్షమాపణలు చెప్పాలి

ABN , First Publish Date - 2022-12-09T12:05:13+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు.

Nadendla Manohar: సజ్జల రెండు రాష్ట్రాలకు క్షమాపణలు చెప్పాలి

విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Janasena PAC Chairman Nadendla Manohar Fire on Sajjala Ramakrishna Reddy) తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలకు సజ్జల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో ఏపీ ఆస్తులు తెలంగాణాకు ఎందుకు కట్టబెట్టేశారని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రం కలసి ఉంటే బాగుటుందని ప్రజలను అయోమయస్థితిలోకి నెట్టుతున్నారన్నారు. ఉద్యోగులను ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

సజ్జల వ్యాఖ్యలు ఇవే...

కాగా... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ (Undavalli Arunkumar) పిటిషన్ ఆధారంగా తిరిగి రెండు రాష్ట్రాలు కలిపి ఉంచాలనే పరిస్ధితి సుప్రీంకోర్టులో వస్తే దాన్ని వైసీపీ (YCP) స్వాగతిస్తుందంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-09T12:05:14+05:30 IST