Share News

Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:17 PM

Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్‌తో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్‌ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్‌కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను మంత్రి విజ్ఞప్తి చేశారు.

Minister Uttam: జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 25: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్‌తో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి (Minister Uttamkumar Reddy) గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్‌ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్‌కు కాళేశ్వరం (Kaleshwaram) అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను మంత్రి విజ్ఞప్తి చేశారు. కమిషన్ అడిగిన వివరాలు, కమీషన్‌‌కు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని కమిషన్‌కు ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు.

PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జస్టిస్ చంద్ర ఘోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి చీఫ్‌గా జస్టిస్ చంద్ర ఘోష్ ఉన్నారన్నారు. మేడిగడ్డ నిజానిజాలు తేల్చడానికే ప్రభుత్వం కమిషన్లు వేసిందన్నారు. చంద్ర గోష్‌కు లీగల్ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని తెలిపారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ మొదలైందన్నారు. ఎన్డీఎస్‌ఏ నుంచి మరో నాలుగు తాత్కాలిక రిపోర్ట్ వస్తుందని చెప్పారు. మేడిగడ్డ అంశంపై ఎన్డీఎస్‌ఏ రిపోర్టు ఆధారంగానే కార్యచరణ ఉంటుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

AP Elections 2024: పవన్‌ను పెళ్లాల పేరిట విమర్శించే వైఎస్ జగన్‌కు భారీ షాక్!


కాగా.. ఈరోజు ఉదయం బిఆర్కే భవన్‌లో జస్టిస్ చంద్ర గోష్ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఈఎన్‌సీలు అనిల్ కుమార్, నాగేందర్రావు హాజరయ్యారు. మేడిగడ్డపై కమిషన్‌కు నోడేల్ టీం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. మేడిగడ్డకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కమిషన్‌కు ప్రభుత్వం ఇవ్వనుంది.


ఇవి కూడా చదవండి....

Telangana: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీ కీలక నిర్ణయం..

Jagan Vs CBN: ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 25 , 2024 | 02:17 PM