Share News

Paid Holiday: రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు

ABN , Publish Date - May 10 , 2024 | 12:27 PM

తెలంగాణ(telangana)లో లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(government) సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు(paid holiday) ఇస్తున్నట్లు ప్రకటించింది.

Paid Holiday: రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు
May 13th 2024 is a paid holiday in telangana

తెలంగాణ(telangana)లో లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం(government) సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 13న వేతనంతో కూడిన సెలవు(paid holiday) ఇస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ మే 13న జరగనుంది. ఇదే రోజు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.


ఈ ఉత్తర్వులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ సెలవు(holiday) నిబంధనలను కచ్చితంగా అన్ని కంపెనీలు, సంస్థలు అమలు చేయాలని వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని, లేదంటే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. అయితే ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఇది కూడా చదవండి:

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 12:38 PM